Sahityapedia
Sign in
Home
Your Posts
QuoteWriter
Account
30 Jun 2023 · 1 min read

ఓ యువత మేలుకో..

ఓ యువత మేలుకో..
ఓ నవ యువత తెలుసుకో..

నీకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే ఎలా మిత్రమా…
తెలుసుకోవాల్సింది చాలా ఉంది నేస్తమా…

ఏదో సంపాదించము,
ఏదో బ్రతికేస్తున్నాము..
అనుకుంటే ఎలా ఎలా..
అలావుంటే ప్రపంచం ఇప్పటికీ చీకటిలో ఉండేది సుమా..

మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి సోదరా.
లక్ష్యం అంటే కేవలం ధన సంపాదన , ఉద్యోగం కాదు మిత్రమా..

నీవు పది మందికి ఉపయోగపడాలి.
దేశానికి మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి సహోదరా…

అవకాశం వచ్చినప్పుడు వదలకు మిత్రమా..
మంచిని కోరే గురువు ను వదలుకోకు నేస్తమా..

కష్టాలనుంచే గొప్ప వారు అయ్యారు సోదరా…
సోమరితనం ఎప్పటికీ దరిద్రులను చేస్తుంది సహోదరా…

నిద్ర లేవు, ఇక ఆలస్యం చేయకు.
నీ లక్ష్యం వైపు అడుగులు వేయి….
నవతరాన్నీ నిర్మించు…
అసలైన దేశ భక్తుడు గా,
అసలైన మానవుడు గా అవతరించు…
అవతరించు….

రచన
డా. గుండాల విజయ కుమార్

Loading...