మనిషి ఓ మరమనిషి తెలుసుకో ఈ ప్రపంచపది..
![](https://cdn.sahityapedia.com/images/post/07cc3c0acde9e46a772c40438667bf56_b390c9ff85ec2dc84fdfb406c8cc3fde_600.jpg)
మనిషి ఓ మరమనిషి
తెలుసుకో ఈ ప్రపంచపది
అంధకారంలో వెలుగును వెతికే వెర్రి మనిషి..
స్వార్థం తో సమాజాన్ని బాగు చేయాలి అనుకునే మూఢ మనిషి..
అధర్మం తో గెలిచాననుకునే అవినీతి మనిషి..
కన్న ప్రేమ బంధాలను త్రుంచి,కనే ప్రేమ బంధాలకు పంచాలనుకునే అమాయకపు మనిషి…
అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆడించి జాలి లేని మనిషి..
అజ్ఞానం లో విజ్ఞానంను పంచె తెలివిలేని మనిషి..
ప్రపంచం లో అన్నీ డబ్భుతో కొనాలనుకునే మూర్ఖపు మనిషి..
ఎవరికి వారు బ్రతకాలనుకునే ఏకాకి మనిషి…
సమస్థం ఉన్నా ఏమీ లేని పేద మనిషి..
అన్నీ చూస్తూ కూడా ఏమీ చేయలేని గుడ్డి మనిషి..
మనిషి ఓ మరమనిషి
తెలుసుకో ఈ ప్రపంచపది
రచన
డా. గుండాల విజయ కుమార్