ఉగాది
![](https://cdn.sahityapedia.com/images/post/d511475b9f33178da9dd93438326c9c7_33b4bce81455ab9bf7957933c91d739f_600.jpg)
నూతన సంవత్సర యుగాది ఈ ఉగాది.
పసిడి వెలుగుల ప్రకృతి వెలుగు ఈ ఉగాది.
జగతి కి దిక్సుచి ఈ ఉగాది.
కర్మ ఫలం ను నిర్ణయించే రాశిఫలం ఈ ఉగాది.
ఆదాయాన్ని నిర్ణయించే వ్యయం ఈ ఉగాది.
కష్ట నష్టాల సూచి పట్టిక ఈ ఉగాది.
ఆరు రుచుల నవజీవిత ఆరంభ మాసం ఈ ఉగాది.
ఆశ ను కలిపించే ఆశయం ఈ ఉగాది.
నూతన ఉత్సాహాన్ని నింపే నవ ఉగాది.
ఈ యుగాది మన ఉగాది…
రచన
డా. గుండాల విజయ కుమార్