ఓ తోష పంతంగమా!
![](https://cdn.sahityapedia.com/images/post/9ae683b61bf8372bb9c58b3725e027b6_0aa4c0464fe798f1c1b7c2c200d8154b_600.jpg)
సంక్రాంతి పండుగ పవనంలో విహరించే ఓ తోష పంతంగమా!
రంగు రంగుల రంగేళి లతో
విరబూసిన గొబ్బెమ్మల అందాలతో..
పచ్చ పచ్చని పసిడి తోరణాలతో..
పసుపు గడప లతో..
చెరుకు గడలతో..
మదిలో విహరించే ఓ తోష పంతంగమా!
పైరు పచ్చని పంటలతో..
పంట రాశుల భోగములతో..
హరిదాసు కీర్తనలతో..
హరివిల్లు అందాలతో
మదిలో విహరించే ఓ తోష పంతంగమా!
ఘుమ ఘుమలాడే భోజ్యాలతో..
గజ గజ లాడే చలి మంటలతో…
కోడి పందాల తో
భోగి భాగ్యాలతో..
మదిలో విహరించే ఓ తోష పంతంగమా!
రచన
డా. గుండాల విజయ కుమార్