కృష్ణా కృష్ణా నీవే సర్వము
కృష్ణా కృష్ణా నీవే సర్వము
కృష్ణా కృష్ణా నీవే మూలము..
ఆదివి నీవు, అనంతము నీవు
శక్తి వి నీవు ముక్తి వి నీవు
శాంతివి నీవు సహనము నీవు
జ్ఞానము నీవు, గమ్యము నీవు
విజయము నీవు అమరము నీవు
శాస్త్రము నీవు, శస్త్రము నీవు
నీవే నీవే సర్వము నీవే
నీదే నీదే సర్వము నీదే
దయచూపుము కృష్ణా మా పై
రక్షింపుము మా మనుజులను
కృష్ణా కృష్ణా నీవే సర్వము
కృష్ణా కృష్ణా నీవే మూలము..
రచన
డా. గుండాల విజయ కుమార్