అందమైన తెలుగు పుస్తకానికి ఆంగ్లము అనే చెదలు పట్టాయి.
అందమైన తెలుగు పుస్తకానికి ఆంగ్లము అనే చెదలు పట్టాయి.
అందమైన అక్షరమాలను
అంతం చేయడానికి వచ్చింది ఈ అందమైన పూతతో ఈ ఆంగ్ల చెదలు.
తుమ్మెద, పువ్వులోని మకరందం ను తాగేసినట్టు,
తెలుగు నేలలో తెలుగు ను నాశనం చేస్తుంది ఈ ఆంగ్లము.
‘మమ్మీ’ అనే పదం తో మాతృత్వాన్ని,
‘డాడీ’ అనే పదం తో తండ్రి ప్రేమను దూరం చేసింది.
మమ్మీ అంటే చనిపోయిన ‘శవము’ అని,
డాడీ అంటే ‘చనిపోవటానికి సిద్ధంగా ఉడడం’ అని,
తెలిసో, తెలియకనే
పలుకుతున్నాము.
ఆంగ్లము తెలిసినవాడు గొప్ప మేధావి అనుకోవడం మన మూర్ఖత్వం.
ఆంగ్లము అంటే కేవలం ఒక భాష అని, అదీ పరదేశి భాష అని ఎప్పుడు తెలుసుకుంటామో.
తెలుగు నేలలో అంతరిస్తున్న ఈ తెలుగు భాష ను కాపాడడం కోసమే ఈ చిన్న తెలుగు తునక…..
రచన
డా. గుండాల విజయ కుమార్