హాస్య కవిత
“రమ్ము”, సారా,కల్లు తాగి వదిలిన తవిక పండితుడు.
“రమ్ము” రమ్ము ఇటు రమ్మని పిలిచిన కవులకు,
తెలుగు భాష “సార” మంతా తాగిన పండితున్ని,
నా ఈ “తవిక”ను విని,
“కల్లు” మూసుకొని విని ఆనందించిరి ఈ పండిత కవులు.
నోరు, మనసు, నొక్కు,కక్కు, కిక్కు..ఫక్కున..
కిక్కిరిసిన పెండ్లి భోజనము నందు నేను
ఘుమ ఘుమ వంటకాలు చూసి
నోరు ఊరింది..
మనసు వెళ్ళింది…
కుక్కి కుక్కిన భోజనము..
బయటకు కక్కితిని..
అది చూసి జనము ఫక్కున నవ్వెను
రచన
గుండాల విజయ కుమార్