దీపావళి జ్యోతులు
![](https://cdn.sahityapedia.com/images/post/b92d6bc3313053a2ad9e0aabddb61d3a_5310acc0166913b77941df4b539e9530_600.jpg)
దీపావళి జ్యోతులు
దీపము అంటే జ్ఞానము.
మన అజ్ఞాన చీకటిని
తొలగించి, విజ్ఞాన జ్యోతుల ను వెలిగించేదే ఈ దీపావళి.
అధర్మాన్ని గెలిచి, కష్టాలను జయించి, సమస్యలను చేదించి, లక్షాన్ని చేరుకొని,విజయం సాదించి
ఆనందం తో వెలిగించే జ్యోతి ఈ దీపావళి.
అమావాస్య చీకటిని పున్నమి వెలుగు గా మార్చే జ్యోతులు,
ప్రకృతి ని కాపాడే జ్ఞాన జ్యోతులు,
విశ్వమంతా వెలుగు నిచ్చే అఖండ జ్యోతులు,
ఈ దీపావళి జ్యోతులు.
యువతకు జ్ఞానజ్యోతులు
పేదలకు ఆశా జ్యోతులు,
శ్రమించే వారికి విజయ జ్యోతులు
ఈ దీపావళి జ్యోతులు.
భక్తులకు పుణ్య జ్యోతులు
ముక్తి ని ప్రసాదించే మహిమ జ్యోతులు
ఈ దీపావళి జ్యోతులు.
రచన:
గుండాల విజయ కుమార్