సంస్థ అంటే సేవ
సనాతనము అంటే ధర్మము . బలవంతముతో భక్తి రాదు. కానీ మంచి మాట తో మంచి పని తో మాత్రమే మనిషి ని భక్తి మార్గం లో తీసుకొనిపోగలము.
భయంతో కానీ, అధికారం తో కానీ వీరులను తయారుచేయలేము.
అందరిని సంఘటితం చేసే విధానం సక్రమంగా ఉంటే సంఘం బలంగా ఉంటుంది.
ఎవరికి వారు గొప్పవారు, అధికార గర్వము చులకన భావం ఉన్నప్పుడు సంఘం ముందుకు నడవదు.
అధికారం అంటే కార్యకర్తలను సమనవ్యయ పరచడం. వారికి మార్గ నిర్దేశం చేయడం అంతే కాని వారి ని ఆదేశించడం కాదు. వారి మీద అధికారం చేలాయించడం కాదు. సంస్థ ధర్మం గా ముందుకు పోవాలి. ధర్మ సంస్థ మరియు స్వచ్చంద సంస్థ ధర్మంగానే ముందుకు పోవాలి. అప్పుడే సంస్థ అనుకున్న లక్ష్యానికి చేరుకుంటుంది. భయం తో అధికారం తో కానీ సంస్థ ను సంఘటితం చేయాలనుకుంటే అది ఎప్పటికి కాదు. ఉన్నవాళ్లు కూడా సంస్థ కు దూరం అవుతారు..
అధికారం తో గర్వం తో కార్యకర్తలను గాని భక్తి ని కానీ తీసుకొనిరాలేము.
మంచి మాటకు పెద్ద బండ రాయి అయిన కరుగుతుంది.
రాముని గురించి తెలుసుకుంటే రామ నామ గొప్పతనం తెలుస్తుంది..
దేవుని సేవకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.కొన్ని అనివార్య కారణాల వలన సంస్థ కు సేవ చేయనంత మాత్రాన వాడికి పాపం జరుగుతుంది అంటే ఎలా..
మనం మంచి మాట తో ఎంతోమందిని సంఘటితం చేయవచ్చు.. నేనె గొప్ప అనుకుంటే ఏమి చేయలేము…
నా అభిప్రాయము…🙏🙏
జయ శ్రీ రామ…