వీరుల స్వాత్యంత్ర అమృత మహోత్సవం
డెబ్భై ఐదు వసంతాల మహోత్సవం,
మన ఈ స్వాత్యంత్ర అమృత మహోత్సవం.
“స్వరాజ్యం నా జన్మహక్కు”అని గర్జించిన తిలక్ గారి ,
అమృత మహోత్సవం.
“నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను” , జై హింద్ అన్న ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ‘ వ్యవస్థాపకుడు మన
సుభాష్ చంద్ర బోస్ గారి అమృత మహోత్సవం.
ఇంక్విలాబ్ జిందాబాద్ , మనుషులను చంపగలరేమో..
వారి ఆదర్శాలను చంపలేరు.
దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు. అన్న మన విప్లవ వీరుడు భగత్‌సింగ్, గారి
అమృత మహోత్సవం.
“సత్యమేవ జయతే” అన్న నినాదం, మన ఉపనిషత్తులను గుర్తు చేసిన, మన స్వాతంత్ర్య వీరుడు మన మదన్ మోహన్ మాలవ్యా గారి అమృత మహోత్సవం.
“వందేమాతరం! వందేమాతరం!” అని బ్రిటిష్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన మన విప్లవ వీరుడు మన్యం దొర అల్లూరి సీతా రామరాజు గారి,
అమృత మహోత్సవం.
“సత్యాగ్రహము అనేది బలహీనుల కోసమో లేదా పిరికివాళ్ళ కోసమో కాదు”, అని భారత ఐక్యత ను కాపాడిన మన ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి
అమృత మహోత్సవం.
ఇంకా ఎందరో గొప్ప మహనీయుల
కర్మ ఫలం,త్యాగపలం, ఈ అమృత మహోత్సవం.
మృతం కానిది అమృతం, మరణం లేనిది అని అర్థం.
మన భారత స్వాతంత్ర్య యోధులు చిరంజీవులు.
వీరిది ఈ అమృత మహోత్సవం.
డా. గుండాల విజయ కుమార్