భారత దేశ వీరుల్లారా
భారత దేశ స్వాతంత్ర వీరుల్లారా,
భరత మాత ప్రియ పుత్రుల్లారా,
వందనం మీకు అభివందనం.
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు
అర్పించిన వీరుల్లారా,
సంకెళ్ళతో బందీ ఉన్న భారత మాత ను, బంధ విముక్తులను చేసిన శూరుల్లారా,
వందనం మీకు అభివందనం.
తెల్లవారి తూటాలకు ఎదురేళ్లి
నిలిచిన మీ ధైర్యానికి జోహార్లు.
తెల్ల దొరల నడ్డి విరిచి,
త్రివర్ణ జండా ను ఎగురవేసిన,
భరత మాత ముధ్ధు బిడ్డల్లారా.
వందేమాతరం అనే నినాదంతో,
తెల్ల దొరలకు వణుకు పుట్టించిన వీరుల్లారా,
వందనం, అభివందనం.
దేశభక్తుల ప్రభంజనాన్ని చూసి
పారిపోయింది ఈ బ్రిటిష్ సైన్యం.
మీ త్యాగాలు మరువదు ఈ భూమి.
సదా మిమల్ని స్మరిస్తుంది ఈ భరత భూమి.
ప్రపంచానికి చాటి చెప్పింది ఈ భూమి యొక్క గొప్పతనాన్ని, ఇది వీరుల కన్న గొప్ప దేశమని,
భావితరాలకు బాటలు వేసిన వీరుల్లారా,
వందనం, అభి వందనం.
మా స్వేచ్చా జీవితానికి కారణభూతులైన మీకు వందనం అభి వందనం.
జై భరతమాత,
జై జై స్వాతంత్ర్య వీరుడా!
వందేమాతరం.
డా. గుండాల విజయ కుమార్