భగ భగ మండే భగత్ సింగ్ రా!
భగ భగ మండే భగత్ సింగ్ రా
భారత దేశ అమర జ్యోతి రా.
“విప్లవం వర్ధిల్లాలి” అనే నినాదం తో చైతన్య పరిచిన విప్లవ వీరుడు.
ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను ఉత్తేజపరిచిన ‘ఎరుపు వీరుడు.’
“నేను ఒక మనిషిని, మానవాళిని ప్రభావితం చేసేవన్నీ నాకు సంబంధించనవే’’ అన్న మహా మనిషి.
జీవితాన్ని ప్రేమిస్తాం.. మరణాన్ని ప్రేమిస్తాం.. మేం మరణించి..
ఎర్రపూల వనంంలో పూలై పూస్తాం..
ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం..
నిప్పురవ్వల మీద నిదురిస్తాం’’
అన్న ‘నిప్పు రవ్వ’ భగత్ సింగ్.
“దేశం కోసం చనిపోయేవారు..
ఎల్లకాలం బతికే ఉంటారు’’ అన్న గొప్ప దేశ భక్తుడు.
“చెవిటి వారికి వినబడాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి.” అని బ్రిటీష్ వారిని భయ పెట్టిన వీరుడు.
“ప్రేమికులు, వెర్రివాళ్లు, కవులు ఒకే ముడిసరుకుతో తయారవుతారు’’ అన్న గొప్ప కవి.
వారు నన్ను చంపవచ్చు. కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు. నా ఆత్మను దహించలేరు’’ అన్న గొప్ప దేశ భక్తుడు.
రచన
గుండాల విజయ కుమార్