నేటి ప్రపంచం
నేటి ప్రపంచం లో ధనము కు దాసోహం అంటున్నారు..
ధర్మాన్ని దరిద్రం అంటున్నారు..
చెడు ను పోషించుకుంటున్నారు,
మంచి ని వదిలివేస్తున్నారు..
అసత్యాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు..
సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు..
నేను అనే లోకంలో బ్రతుకుతున్నారు.
లోకంలో నువ్వు ఒకడివి అని తెలుసుకోలేకపోతున్నారు..
సముద్రము లో నీరు ఎంత ఉన్నా ఆ నీటిని తాగలేము.. అలాగే,,
మనిషి ఎంత గొప్పవాడు అయినా మంచి గుణములు లేకుంటే వ్యర్థము కదా..
రచన
డా. గుండాల విజయ కుమార్