నీవే మా రైతువి…
పుడమి శ్రామికుడు మనకు అన్నా న్ని అందిచే అన్నదాత.
పాడి పంట నే అతనికి ఆస్థి-పాస్థులు
ప్రకృతి యే అతనికి చుట్టాలు.
జంతువులే అతనికి మిత్రులు.
అతని లక్ష్యం ధాన్యాన్ని అందిచడం.
నిస్వార్థపరుడు, ప్రజలను పుష్టి పరచువాడు.
కష్టాన్ని భరిస్తూ ఇష్టం తో పనిచేయువాడు.
మిత సంతోషి చిరు నవ్వుతో చిరు ధాన్యాలు పండించేవాడు..
నీవు లేనిదే దేశం లేదు.
నీవు దేశానికి వెన్నుముక్కవు..
మా జీవనానికి ఆధారభూతుడవు
సామాన్య రూపము అసమాన్య కార్యము
నీవే మా కర్షకుడువి
నీవే మా హాలికుడవి
నీవే మా కుటింబివి
నీవే మా సేద్యకారుడివి
నీవే మా కృషీవలుడవు
నీవే మా పెద్ద కాపువి
నీవే మా రైతువి…
దేశానికి పెద్ద దిక్కువి..
రచన
డా.గుండాల విజయ కుమార్