గురు శిష్యుల బంధము
![](https://cdn.sahityapedia.com/images/post/fb217ca2641476dbfa75c19ae88e656a_f1c5069d60c34863dbccca2133b97a66_600.jpg)
గురు శిష్యుల బంధము
చందనం లోని సుగంధం
నది పైన వారధి…
రాతి లోని శిల్పం…
వృక్షం పైన ఫలం …
శిష్యులపై గురువుకు ఉండేది..
అనురాగపు ప్రేమ..
రాబోయే ఆశయం..
సాధించే సాధకుడు..
చరిత్రను సృష్టించే వీరుడు..
గురువు పై శిష్యులకు ఉండేది.
భక్తి తో వుండే ప్రేమ.
జ్ఞాన స్వరూపుడు..
విజయానికి మార్గదర్శకుడు…
చరిత్ర నిర్మాణానికి మూల పురుషుడు..
గురువులకి వందనం..
అభివందనం…
రచన
డా. గుండాల విజయ కుమార్