అభివృద్ధి చెందిన లోకం
ఏముంది ఈ లోకం లో
అంతా చీకటి.
జ్ఞానం అనుకుని ఆజ్ఞానం లో జీవిస్తున్నారు.
అందరి కి అన్నం పెట్టే రైతు పస్తుల్లో బతుకుతున్నారు.
ఎవరి సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో తెలియదు.
జ్ఞానాన్ని ప్రసాదించే పుస్తకాలని నడిచే దారి లో అమ్ముతున్నాము.
కాలు కు వేసే చెప్పులను మాత్రం అద్దాల మెడ లో అమ్ముతున్నాము.
పిల్లలను అతిగారభం తో నాశనం చేస్తున్నాము.
విద్య ను కొనుగోలు చేస్తున్నాము.
జ్ఞానాన్ని వదిలేస్తున్నాము.
ఉచితం అనే పేరు తో జనాన్ని నమ్మిస్తున్నాము, బద్దకస్తులు గా మారుస్తున్నాము.
యువకుల ప్రతిభ కు ఇచ్ఛే బహుమతి నిరుద్యోగం.
మంచితనం అనే ముసుగు లో మాయలు చేస్తున్నాము.
ధనం కోసం దౌర్జన్యానికి సిద్దపడుతున్నాము.
చావు కు అర్థం లేదు.
సంస్కారం అసలే లేదు.
సంస్కృతి కి కొత్త అర్థం చెపుతున్నాము.
ధర్మాన్ని గుడి లో ఉంచి మొక్కేస్తున్నాము.
ధర్మమార్గం లో జీవించే వాన్ని పిచ్చోడిని, అమాయకుడు ని చేస్తున్నాము.
మతం లో జీవిస్తున్నాము.
మమతలు మాయం చేస్తున్నాము.
ధనము కొరకే జీవిస్తున్నాము.
ఆనందం కొరకే ఆశిస్తున్నాము.
విషయం తెలుసుకొని విదేశాలకి వెలుతున్నాము.
గురువుకె హితబోధ చేస్తున్నాము.
గుడ్డి విద్య ను గురుబోధ చేస్తున్నాము.
రోగాలను కొనుగోలు చేస్తున్నాము.
వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నాము.
కోరికలు తీరడానికి కన్నులు మూసుకొని గుడి చుట్టూ తిరిగేస్తున్నాము.
ధనానికి అధికారం ఇచ్చాము.
స్వార్థం,అసూయ,ఈర్ష్య అనే ఆభరణాలు దరిస్తున్నాము.
పంతాలతో పరువు తీసుకుంటున్నాము.
మేధావులను పుస్తకాలకు పరిమితం చేస్తున్నాము.
అంతా నాకే తెలుసు అనే భ్రమ లో బ్రతికేస్తున్నాము.
“ఇది ప్రస్తుత అభివృద్ధి చెందిన లోకం.”
రచన
గుండాల విజయ కుమార్