బాలాత్రిపురసుందరి దేవి
త్రిపురుని అర్ధాంగి
బాలాత్రిపుర దేవి నమస్కరోమి..
బుద్ది,మనస్సు,చిత్తం,అహంకారం ఆధీనంలోవుండే దానివి..
అభయహస్త ముద్రతో, అక్షరామాల ధరించిన దానివి..
మానసిక భాదలను తొలగించే నిత్య సంతోషినివి..
మనస్సులో కొలువుండే జాగృత్, స్వప్న , సుషుప్తి తత్వానివి..
బండాసుర రాక్షస నలపై మంది పుత్రులను సంహరించినదానివి..
అర్ధచంద్ర బాణ ఆయుధ దారిణివి..
నీ పరాక్రమం చూసి దేవతలు కూడా గడగడ లాడిరి..
శత్రు సంహరిణివి..అతి భయంకరివి..
ప్రాణ శక్తి ని ప్రసాదించే ప్రాణమూర్తివివి..
బాలాత్రిపురసుందరి దేవి నమస్కరోమి.. నమస్కరోమి…
రచన
డా.గుండాల విజయ కుమార్