నమో గణేశ
నమో గణేశ!
ఆది దేవా నమో నమః
వినాయక నమో నమః
విశాల కన్నులు కలవాడా,
విశ్వ మంతటి కి శాంతి ప్రసాదించు దేవా.
జ్ఞాన మార్గం వైపు నడిపించు మహాదేవా.
విశ్వమంతా చల్లని చూపుతో చూడు దేవా.
ఎలాంటి విఘ్నలూ జరగకుండా రక్షించు మహాదేవా.
బుద్ధివిదాతా! మంచి బుధ్ది ని ప్రసాదించు దేవా.
సత్యం,న్యాయం, ధర్మం వైపు నడిపించు మహాదేవా.
ఉమాపుత్ర! జగతి కి ప్రేమ ను ప్రసాదించు దేవా.
ప్రేమబంధాలను కాపాడు మహాదేవా.
భూపతి! భూమి ని చల్లగా చూడు దేవా.
ప్రకృతి ని ప్రళయం నుంచి రక్షించు మహాదేవా.
నీ నామ జపం సకల పాప నాశనం.
నీ నామ స్మరణం మోక్షప్రధాయం
సదా నిన్ను కొలుతుము దేవా.
జయ గణేశా! జయ వరప్రదా!
పాహిమాం! పాహిమాం!
రక్షమాం! రక్షమాం!……
రచన
డా. గుండాల విజయ కుమార్