Sahityapedia
Sign in
Home
Your Posts
QuoteWriter
Account
24 Aug 2024 · 1 min read

మగువ ఓ మగువా నీకు లేదా ఓ చేరువ..

మగువ ఓ మగువా నీకు లేదా ఓ చేరువ..

సృష్టి కి మూలానివి నీవు కానీ అయినావు ఉనికె లేని ధాత్రివి..
మగువ ఓ మగువా నీకు లేదా ఓ చేరువ..

అందానికి అర్థానివి నీవు కానీ జనపదుడి పాలిట అయినావు అమాయకపు తోలుబొమ్మవు..
మగువ ఓ మగువా నీకు లేదా ఓ చేరువ..

శక్తి కి మూలానివి నీవు కానీ అయినావు పుడమి బంధివి..
మగువ ఓ మగువా నీకు లేదా ఓ చేరువ..

అన్నము అందిచే అన్నపూర్ణవు కానీ అయినావు అమాయకపు కొంజికవు.
మగువ ఓ మగువా నీకు లేదా ఓ చేరువ..

రచన
డా.గుండాల విజయ కుమార్

Loading...