Sahityapedia
Sign in
Home
Your Posts
QuoteWriter
Account
20 Feb 2024 · 1 min read

రామయ్య రామయ్య

రామయ్య రామయ్య
భక్తులను కాపాడే దేవుడయ్యా.
చూడయ్యా చూడయ్యా భక్తులను చల్లగా చూడయ్యా.

ఇక్ష్వాకు వంశపు రాజయ్య మహారాజయ్య.
దశరధుని కుమారుడు రామయ్య మా దేవుడయ్యా.

తండ్రి మాట జవదాటడు
రామయ్య మా రామయ్య
జానకీవల్లబుడు రామయ్య మా దేవుడయ్య.

సత్య ధర్మ పరిపాలుడు రామయ్య మా రామయ్య.
రావణ సంహరుడు రామయ్య మా దేవుడయ్య.

మిత బాష కోవిదుడు రామయ్య మా రామయ్య
స్మితవక్త్ర రూపుడు రామయ్య మా దేవుడయ్యా.

జగతి ని కాపాడే రామయ్య, మా రామయ్య.
భక్తుల బాధలు తీర్చే రామయ్య మా దేవుడయ్యా..

రచన
డా. గుండాల విజయ కుమార్

Loading...