శ్రీ గాయత్రి నమోస్తుతే..
సత్యలోక మణి ద్విప నివాసి, శక్తి స్వరూపిణి శ్రీ గాయత్రీ నమోస్తుతే.
సకల వేద స్వరూపి, మంత్ర మూల శక్తి శ్రీ గాయత్రి నమోస్తుతే..
ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణముఖే,
శంఖం, చక్రం, గద, అంకుశ దారిని, శ్రీ గాయత్రి నమోస్తుతే..
ప్రాతః కాలే గాయత్రీ నామ, మధ్యాహ్న సావిత్రి నామ, సాయం సంధ్య సరస్వతి నామ , శ్రీ గాయత్రి నమోస్తుతే..
శ్రీ ముఖే అగ్ని, శిరస్సెతు బ్రహ్మ, హృదయంచ విష్ణు,శిఖే రుద్ర నిలయే శ్రీ గాయత్రి నమోస్తుతే..
శ్రీ గాయత్రి నమోస్తుతే..
వేద జ్ఞాన దేవీ నమోస్తుతే..
రచన
డా.గుండాల విజయ కుమార్