భారత దేశం మన పుణ్య ప్రదేశం..
భారత దేశం మన పుణ్య ప్రదేశం..
భారత ఖండం ముక్తి కి మార్గం..
కళలకు నిలయం భాషల వలయం..
మమతల మందిరం
ప్రేమ పూల వనం..
శాంతికి నిలయం..శక్తి కి విలయం.
అణువు అణువు కనిపించే దేశ ఔనతి..
నర నరాల్లో జీవించే దేశ సంస్కృతి..
తరతరాల చరిత గల పుణ్య ప్రదేశం. ఋషులున్న ప్రదేశం..
మన భారత దేశం..
చేయి చేయి కలపాలి
దేశ భక్తి పెంచాలి..
ప్రతి ఒక్కడు సైనికుడై
దేశ సేవ చేయాలి..
దేశమాత రక్షణ కై ప్రాణార్పణ చేయాలి..
ఇదే ఇదే మన భారతదేశం మన పుణ్య ప్రదేశం..
రచన
డా.గుండాల విజయ కుమార్