భరత మాతకు వందనం
భరత మాతకు వందనం
భరత భూమి కి వందనం
విశ్వ శాంతిని కోరుదాం
విశ్వ హిందువుగా మారుదాం..
హిందు అంటే ధర్మము
ధర్మ రక్షనే మా కర్తవ్యము
దేశమంటే మనుషులు
దేశ సేవయే మాకార్యము..
యోగమంటే ధ్యానము
ధ్యాన మంటే జ్ఞానము..
గోవు అంటే అమృతం
దేవుడిచ్చిన గొప్ప వరం..
సనాతనము మా ధర్మము
సత్య ధర్మము మా లక్ష్యము
మంచి మాటను పలుకుదాం.
మంచితనమును పంచుదాము..
విశ్వ శాంతి ని కోరుదాం
విశ్వ హిందువుగా మారుదాం..
దేశ మాత ను వేడుదాం.
దేశ భక్తి ని చూపుదాం..
రచన
డా. గుండాల విజయ కుమార్