నా తెలుగు భాష..
తియ్యనైన తెలుగు పలుకు
విశ్వమంతా వెలుగు వెలుగు
అమృతం పంచిన బాష.
అమరత్వం ప్రసాదించిన భాష.
పూల కన్నా మృదువైన భాష.
తేనేకన్నా మధువైన భాష.
తరతరాల కు నిలిచే భాష.
నా తెలుగు భాష, నా మాతృ భాష.
ముత్యాల లాంటి అక్షరమాల.
నవరసాలు నిండే నవరత్న భాష.
నాలుగు దిక్కులు ప్రవహించే
పవిత్ర భాష.
భగవంతుని కి భక్తి భాష
భక్తుని కి ముక్తి భాష.
సాహిత్యానికి సరళ భాష.
భావానికి అర్థమైన భాష.
తరగనిది తెలుగు భాష లోని తియ్యదనం.
కఠినత్వం లేని అమ్మ భాష.
మచ్చ లేని మంచి భాష.
గర్వించే భాష, ప్రాచీన భాష
నా తెలుగు భాష , నా మాతృ భాష.
రచన
గుండాల విజయ కుమార్