నమో సూర్య దేవా
తమస్సు ను దూరం చేసే జ్యోతిర్ మయానివి.
జగత్తు ను జాగృతం చేసే జగత్ రక్షకుడివి.
గగనం లో ప్రయాణించే గగన మణివి.
దినమును నిర్దేశించే దిన కరుడవు.
విశ్వానికి విశ్వకర్ముడవు.
వెలుగును ప్రసాదించే వెలుగురేడువు.
లోక బాధలను దూరం చేసే లోకబాంధవుడివి.
ప్రత్యక్ష ప్రభాకరుడవు.
ఉష్ణాన్ని కలిగించే ఉష్ణ కరుడవు.
రాత్రి ని హరించే రవివి.
జగము కన్నువి, జగము చుట్టానివి,
చిత్ర విచిత్రాలు చూపించే చిత్ర రథుడవు.
ఎండ దొరవు, ఎండ రేడు వి, కాల చక్రానివి.
ఆదిత్యుడవి, అమరత్వా నివి, అరుణ ఆశిరుడవు.
నీవే మా రక్షకుడవు.
నీవే మా సూర్యుడవు.
నమో సూర్య దేవా,
నమో ఆదిదేవ.
నమో నమః.
నమో నమః.
రచన
గుండాల విజయ కుమార్