గురువు కు వందనం.
గురు శిష్యుల బంధము
చందనం లోని సుగంధం
నిర్ఘరిణి పైన సేతువు…
రాతి లోని శిల్పం…
చంకురం పైన మౌక్తికము..
శిష్యులపై గురువులకు ఉండేది..
అనురాగపు ప్రేమ..
భవిష్యత్ ఆశయం..
సాధించే సాధకుడు..
చరిత్రను సృష్టించే వీరుడు..
గురువు పై శిష్యులకు ఉండేది.
భక్తి తో వుండే ప్రేమ.
జ్ఞాన స్వరూపుడు..
విజయానికి మార్గదర్శకుడు…
చరిత్ర నిర్మాణానికి మూల పురుషుడు..
గురువులకి వందనం..
అభివందనం…
రచన
డా. గుండాల విజయ కుమార్