ఎందుకు ఈ లోకం పరుగెడుతుంది.
ఎందుకు ఈ లోకం పరుగెడుతుంది.
ఎవరి కోసం ఈ లోకం పరుగెడుతుంది.
విజ్ఞానం అనుకోని అజ్ఞానం వైపు వేగంగా పరుగెడుతుంది.
సత్యం నుంచి దూరంగా అసత్యం వైపు.
న్యాయాన్ని చీల్చి అన్యాయం వైపు
చాలా వేగంగా పరుగెడుతుంది ఈ లోకం.
మంచిని, మానవత్వాన్ని సమాధి చేసి మూర్ఖంగా పరుగెడుతుంది.
ప్రేమను త్రుంచి వేసి ధనార్జనకై వేగంగా పరుగెడుతుంది.
ధనమే మూలంగా అన్యాయం, అసత్యం, అసూయ,గర్వం అనే మాయలో చాలా వేగంగా పరుగెడుతుంది.
నాకు అంతా తెలుసు, నాదే నిజము అనే భ్రమ లో పరుగెడుతుంది లోకం.
ఎందుకు పరుగెడుతుంది తెలియదు.
ఎవరి కోసం పరుగెడుతుంది తెలియదు.
పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయి వెనుక తిరిగి చూసుకుంటే అంతా శూన్యమే.
చివరికి మిగిలింది శూన్యమే.
రచన
గుండాల విజయ కుమార్
హైదరాబాద్, తెలంగాణ